Sunday, December 22, 2024

పేద, మధ్య తరగతి వర్గాల యువతకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా

- Advertisement -
- Advertisement -
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

రాయపర్తి: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వర్గాల యువతకు డ్రైవింగ్ లైసెన్సు తీసుకోడానికి ఖర్చు ఎక్కువ అవుతుందని వారికి ఖర్చు తగ్గివాలనే ఉద్దేశంతో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సు మేళా ప్రారంభించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. బుధవారం రాయపర్తి మండల కేంద్రంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్సు మేళాను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. అనంతరం కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వర్గాల యువతకు డ్రైవింగ్ లైసెన్సు తీసుకోడానికి ఖర్చు ఎక్కువ అవుతుందని వారికి ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో లైసెన్సు ఇప్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, ఆకుల సురేందర్‌రావు, మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, స్థానిక సర్పంచ్ గారె నర్సయ్య, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మాజీ ఎంపీటీసీ ఉందటి సతీష్, మైనార్టీ అధ్యక్షుడు అష్రఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News