- Advertisement -
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశంలో ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. అనాథలైన పిల్లలకు ఉచిత విద్య అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన అనాథలకు ఫిక్స్ డ్ డిపాజిట్ పై నెల నెలా స్టైఫండ్ తోపాటు 23 ఏళ్లు నిండిన తర్వాత రూ.10 లక్షల స్టై ఫండ్ అందచేయనున్నట్లు తెలిపింది. అనాథ పిల్లలకు ఉచిత విద్యకు విద్యారుణం ఇవ్వడమే కాకుండా కేంద్రమే వడ్డీ కట్టనుంది. అలాగే, ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య భీమా కల్పించనున్నట్లు కేంద్రం పేర్కొంది.
Free education for children orphaned by Corona: Center
- Advertisement -