- Advertisement -
భుజ్: గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించి ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) అధికారంలోకి వస్తే ప్రజలందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడమౌతుందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను మరింత మెరగుపరుస్తామని, భారీ సంఖ్యలో కొత్త పాఠశాలలను నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. అన్ని ప్రైవేట్ స్కూళ్లను ఆడిటింగ్ చేసి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అదనంగా వారు వసూలు చేసిన సొమ్మును తిరిగి రాబడతామని ప్రకటించారు. ఢిల్లీలో తాము ఇదే విధంగా చేసినట్టు గుర్తు చేశారు. ప్రైవేట్ స్కూళ్లు విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారాలను అమ్మే పద్ధతిని ఆపు చేస్తామన్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయుల సర్వీసులు క్రమబద్ధం చేస్తామని వారి ఉద్యోగభద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.
Free Education if AAP Will Win in Gujarat: Kejriwal
- Advertisement -