Saturday, November 23, 2024

ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఉచిత విద్యుత్ ఆగదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఉచిత విద్యుత్‌ను ఆపే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం సూర్యాపేటలో ఆయన మాట్లాడు తూ రాయితీ విద్యుత్ ఛార్జీలను డిస్కంలకు ముం దస్తుగా చెల్లించాలనే నూతన కేంద్ర విద్యుత్ విధానంపై స్పందించిన మంత్రి పేద ప్రజలకు అందిం చే రాయితీ విద్యుత్‌పై కేంద్రం కుట్రలు పన్నడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల కు ఉచిత విద్యుత్ అందించడం కేంద్రానికి కంటగింపుగా మారిందన్నారు. కెసిఆర్ ఉన్నంత వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తామన్న మంత్రి సామాజిక, ఆర్థిక సమతుల్యం లేని దేశంలో సబ్సిడీలు అవసరం ఉందన్నారు. విద్యుత్ రం గాన్ని ప్రైవేటు పరం చేయడం కోసమే కేంద్ర ఎత్తు లు వేస్తున్నదని అన్నారు.

అన్నం పెట్టె రైతుకు ఖ ర్చులు తగ్గించి ఆదాయం పెంచడం కోసం సబ్సిడీ లు అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకుచ్చే ప్రోత్సాహాన్ని ఉచితమని కేంద్రం భావించడం అవివేకమన్నారు. ఒకరిద్దరు సంపన్నుల కోసం కోట్లాది మంది ప్రజలను దారిద్య్రంలోకి నెట్టే కేంద్ర ప్రభుత్వ తీరును దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసి ఎండగడతామన్నారు. కేం ద్రం ఫ్యూడల్ ఆలోచనలతో పేదలకు నష్టం వాటిల్లుతుందన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం చేసే దుర్మార్గమైన ఆలోచనకు తాము పూర్తి వ్యతిరేకమని మంత్రి అన్నారు.

మోడీకి బుద్ధి చెప్పడం ఖాయం..

ఫ్యూడల్ విధానంతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నా మోడీకి తగిన బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. పేద ప్రజలకు, అన్నదాతలకు ఇస్తున్న సబ్సిడీలను రద్దు చే యాలని చూస్తున్న మోడీకి గుణపాఠం చెబుతామన్నారు. వ్యవసాయన్ని అన్నదాతలను కాపాడేందు కే ముఖ్యమంత్రి ఉచిత విద్యుత్‌ను ప్రజలకు అందిస్తున్నారని, అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై మోడీ విషం చిమ్ముతున్నారని ఆయన అన్నా రు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నాశనం చేయడమే పనిగా బిజెపి పెద్దలు పనిగట్టుకున్నట్లు తెలిపారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దో చిపెడుతున్న మోడీకి రోజులుదగ్గరపడ్డాయన్నా రు. దేశ ప్రజలను జాగృతం చేసేందుకు కెసిఆర్ బిఆర్‌ఎస్ పార్టీని స్థాపించడాన్నారు. ఉధృతమైన పోరాటాలు చేసి దేశానికి పట్టిన బిజెపి చీడను వదిలిస్తామన్నారు.

ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు..

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం నూతన పొత్తులు ఉంటాయని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ప్రకటనపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో వారికే తెలియదన్నారు. కాంగ్రెస్‌లో ఉండి బిజెపి గెలుస్తుంది, బిజెపిలో ఉండి కాంగ్రెస్ గెలుస్తుందంటారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News