కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్న మోడీ.. అన్నం పెట్టే రైతులకు ఒక్క రూపాయి మేలు చేశారా? పేదలు, సామాన్య ప్రజలు, రైతులంటే ఆయనకు చాలా చిన్నచూపు. అందుకే మోడీకి దిమ్మ తిరిగేలా.. ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఆయన హయంలో నిరుద్యోగం పెరిగింది. రూపాయి విలువ దారుణంగా పతనమైంది. మోడీ సాధించిన ఘనత ఇంతకంటే మరోటి లేదు. మోడీకి పాలన చేతకాదు. ప్రజాస్వామ్య విలువలంటే ఏ మాత్రం గౌరవం లేదు.
దేశం కోసం నన్ను పోరాడమంటున్నారు. ఇందుకు అంతా నా వెంట ఉంటామంటున్నారు. మరి మీరందరూ నన్ను ఆశీర్వదీస్తారా? లేదా? చెప్పాలె. మీ ఆశీర్వాదంతో ఇక త్వరలోనే జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కూడా ప్రారంభిస్తా. ఇక ముందుకు పోవడమే తప్ప.. చూసే అవకాశమే లేదు. తెలంగాణలాగే దేశాన్ని అందరి సహకారంతో బాగు చేస్తా. మోడీ పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన దేశాన్ని.. అభివృద్ధి దిశగా పట్టాలెక్కిస్తా. పచ్చగా ఉన్న తెలంగాణలో కేంద్రం చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ దురుద్దేశ్యంతోనే మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తోంది.
2024లో హస్తినలో బిజెపియేతర ప్రభుత్వం రావడం తథ్యం
అధికారంలోకి రాగానే అన్నదాతలకు తీపి కబురు
బిజెపియేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని రైతులకు
పిలుపు త్వరలో జాతీయ రాజకీయ ప్రస్థానం
ప్రారంభం తెలంగాణను అభివృద్ధి చేసినట్లే దేశాన్ని
ప్రగతిబాటలో నడుపుదాం కార్పోరేట్ గద్దలకు
రూ.12లక్షల కోట్లు మాఫీ.. రైతులకు 1.45 లక్షల కోట్లు ఇవ్వలేరా? రైతు వ్యతిరేక విధానాల పార్టీని
తరిమికొట్టాలి నిజామాబాద్ బహిరంగ సభలో
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్/ నిజామాబాద్ బ్యూరో: వచ్చే ఎన్నిక ల్లో మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని.. అప్పుడు దేశ వ్యాప్తంగా రైతులందరికి ఉచిత కరెంటు ఇస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. 2024 లో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా బిజె పి ఓడిపోతుందన్నారు. ఆ స్థానం లో మన ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందన్నారు. నుంచి దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల కు మేలు జరుగుతుందన్నారు. ప్ర స్తుతం దేశానికి బిజెపి పాలన ఒక శనిలా మారిందని సిఎం కెసిఆర్ తీ వ్రస్థాయిలో దుయ్యబట్టారు. వారి పాలనను సాధ్యమైనంత త్వరగా సా గనంపితేనే దేశానికి మంచి భవిష్య త్ ఉంటుందన్నారు.
జిల్లాలో 25 ఎకరాల్లో రూ.53.52 కోట్లతో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయా భవన సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్)ను స్పీ కర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సిఎం కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మరోసారి కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోడీపై కెసిఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆయ న తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారని మోడీపై ధ్వజమెత్తా రు. కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్న మోడీ.. కి అన్నం పెట్టే రైతులకు ఒక్క రూపా యి అయినా మేలు చేశారా? అని ప్రశ్నించారు. పేదలు, సామాన్యు లు, రైతులంటే ఆయన చిన్నచూపు చూస్తున్నారు అని విమర్శించారు. అందుకే మోడీకి దిమ్మ తిరిగేలా…వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారన్నారు. ఎనిమిదేళ్లలో దేశానికి మేలు జ రిగే విధంగా మోడీ ఒక్క నిర్ణయం అయినా తీసుకున్నా రా? సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి కెసిఆర్ ప్రశ్నించారు. పైగా ఆయన హయంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. రూపాయి విలువ దారుణంగా పతనమైందని విమర్శించారు. మోడీ సాధించిన ఘనత ఇంతకంటే మరోటి లేదని సిఎం కెసిఆర్ ఎద్దేవా చేశారు. మోడీకి పాలన చేతకాదన్నారు. ప్రజాస్వామ్య విలువలంటే ఏ మాత్రం గౌరవం లేదని కెసిఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలుపెడుతా
దేశం కోసం తనను పోరాడాలంటున్నారని కెసిఆర్ అన్నారు. ఇందుకు అందరూ వెంట ఉంటామని చెబుతున్నారని పేర్కొన్నారు. మరి మీరందరూ నన్ను ఆశీర్వదీస్తారా? లేదా? చెప్పాలె అని కెసిఆర్ ప్రశ్నించారు. దీంతో సభలో పెద్దఎత్తున జనం చప్పట్లతో మద్దతు తెలిపారు. మీరు ఇంతగా మద్దతు తెలుపుతుందనడం ఆనందం కలిగిస్తుందన్నారు. ఇక త్వరలోనే జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కూడా ప్రారంభిస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఇక ముందుకు పోవడమే తప్ప….వెనకకు చూసే అవకాశమే లేదన్నారు. తెలంగాణలాగే దేశాన్ని అందరి సహకారంతో బాగు చేస్తామన్నారు. మోడీ పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన దేశాన్ని…తిరిగి అభివృద్ధి దిశగా పట్టాలెక్కిస్తామని సిఎం కెసిఆర్ అన్నారు.
దేశం బాగుంటేనే …రాష్ట్రం బాగుంటది
దేశం బాగుంటనే….రాష్ట్రం బాగుంటుందని సిఎం కెసిఆర్ అన్నారు. కాగా అందుకు విరుద్దంగా బిజెపి పాలన సాగుతోందన్నారు. పచ్చగా ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రంలో కేంద్రం చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే రాష్ట్రంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తోందన్నారు. కానీ వారి పప్పులు ఇక్కడ ఉడకవన్నారు. బిజెపి చెప్పే సొల్లు పురాణాన్ని తెలంగాణ ప్రజలు విశ్వసించరన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారని….అది టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందన్నారు. పచ్చని పంటలతో కళకళలాడుతున్న రాష్ట్రంలో మతపిచ్చి మంటలకు బిజెపి నాయకులు ఉసిగొలుపుతున్నారన్నారు. వారి మాటలను పట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేసుకుందామా? అని ప్రశ్నించారు. ఒక ఇల్లు కట్టాలంటే చాలా కష్టమని…కానీ కూలగొట్టాలంటే అత్యంత సులభమన్నారు. అలాగే రాష్ట్రాన్ని బాగుచేయడం కూడా చాలా కష్టమన్నారు. కానీ రాష్ట్రాన్ని నాశనం చేయడం చాలా సులువన్నారు. అందుకే ప్రజలను మరిమరి కోరుతున్నాన ని, కాషాయం పార్టీ చెప్పే అబద్దాలకు మోసపొవద్దన్నారు.
వాళ్లకే మనం మీటర్లు పెట్టాలే
నిజామాబాద్ గడ్డ నుంచి మోడీని ప్రశ్నిస్తున్న.. దేశంలోని రైతులందరికీ సాగునీరు కరెంటు ఇస్తే రూ.1.45 లక్షల కోట్లు మాత్రమే ఖర్చవుతాయన్నారు. ఎన్‌పిఎల కింద రూ. 12 లక్షల కోట్ల సంపద అమ్ముకున్న మోడీ ప్రభుత్వం దేశ రైతులందరికీ ఉచిత కరెంటు ఇవ్వలేరా? అని కెసిఆర్ ప్రశ్నించారు. దేశాన్ని లూటీ చేస్తున్న బిజెపి వాళ్లు మన బాయిల కాడ మీటర్లు పెట్టుడు కాదు…. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న వాళ్లకే మనం మీటరు పెట్టాలన్నారు. రైతు సంఘాలు, రైతు బిడ్డలు మీ గ్రామాల్లో సమావేశాలు పెట్టి…మోడీ అనుసరిస్తున్న విధానాలపై సమగ్రంగా చర్చ జరపాలన్నారు. రైతు వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలన్నారు. ఆ చైతన్యం రైతుల్లో రావాలన్నారు. మోడీ ప్రభుత్వం దళితులు, బలహీన వర్గాలు ఎవరికీ ఏమీ చేయలేదన్నారు. దేశంలో ప్రతిపక్ష గవర్నమెంటులను కూలగొట్టుడేనా? మీ పని అని మోడీని ఉద్దేశించి ప్రశ్నించారు.
చావు నోట్లో తలపెడితేనే రాష్ట్రం వచ్చింది
ఆనాటి నాయకత్వం చిన్న పొరపాటు చేసి, తెలంగాణను ఆంధ్రాలో కలిపితే.. మళ్లీ రాష్ట్రాన్ని తెచ్చుకోవడానికి ఇ న్నేండ్లు పట్టిందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. తాను కూ డా సావు నోట్లో తలపెడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. ఒక్కనిగా బయలుదేరి అందరినీ కూడగట్టి తాను తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తేనే భారత దేశమే ఆశ్చర్య పోయిందన్నారు. ఒకప్పుడు నిజామాబాద్‌లో భారీ ప్రా జెక్టు ఉండేదని, పాలనలో నిజాంసాగర్, సింగూ రు నీళ్ల్లు మనకు రాలేదన్నారు. రాష్ట్రంలో పేదలు, మహిళలు, విద్యార్థులకు ఎన్నో పథకాలున్నాయన్నారు. లో 24 గంటలు నాణ్యమైన కరెంటును అన్ని రంగాలకు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని కెసిఆర్ పేర్కొన్నారు.
దళితులను ఆదుకునేందుకే దళితబంధు
తరతరాలుగా అణచివేయబడ్డ దళితులను ఆదుకోవడానికే దళితబంధు పథకాన్ని తీసుకొచ్చామని కెసిఆర్ తెలిపారు. దళితబంధు పథకం ఇవ్వడం మన సామాజిక బాధ్యత అని అన్నారు. దీనిని ప్రజా ప్రతినిధులు ముందుకు తీసుకుపోవాలని సూచించారు. తమ తండాలో… తమ పాలన కావాలని గిరిజనులు ఎంతోకాలంగా కోరుకుంటే దానిని ఎవరూ చేయలేకపోయారన్నారు. కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. 3600 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామన్నారు. అలాగే దేశంలో గురుకుల పాఠశాలలు పెట్టుకున్నామన్నారు. మెరుగైన విద్యనందిస్తున్నామని కెసిఆర్ అన్నారు.
భూములను మోడీ దోస్తులే కొంటారట!
మన భూములను అమ్ముకునే పరిస్థితి వస్తే వాటిని మోడీ దోస్తులే కొంటరట అని కెసిఆర్ వ్యంగ్యస్త్రాలను సంధించారు. బిజెపి ప్రభుత్వం ప్రస్తుతం ఎవుసం (వ్యవసాయం) మీద పడ్డరన్నారు. ఈ రంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో నానా యాతన పెడుతోందన్నారు. పంటలకు ధరలు రాక ఎవుసం బందు కావాలని చూస్తోందని విమర్శించారు. కానీ తన బొందిలో ప్రాణం ఉన్నం వరకు రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని కెసిఆర్ స్పష్టం చేశారు. మన రాష్ట్ర ప్రగతితోనే దేశ తలసరి ఆ దాయం గణనీయంగా పెరిగిందన్నారు. సిఎంఆర్‌ఎఫ్‌తో పేద ప్రజలను ఆదుకుంటున్నామన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి మీద చర్చ చేసుకోవాల్సి ఉందన్నారు.
అన్నీ అమ్ముతుండు
విమానాలు, ఓడరేవులు, బ్యాంకులు, పరిశ్రమలు ఇట్లా అన్ని మోడీ అమ్ముతున్నారని కెసిఆర్ ధ్వజమెత్తారు. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం అనే విషయాన్నే ప్రధాని మరిచిపోయారన్నారు. వారు ఉద్యోగాలు ఇవ్వరు కానీ…ఇచ్చే తెలంగాణకు మాత్రం అడుగడుగునా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పైగా మనం అందరికీ ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ఉచితాలట….. వాటిని బంద్ చేయమని కేంద్రం చెబుతోందని మండిపడ్డారు.
రూ. 100 కోట్ల నిధులు మంజూరు
నిజామాబాద్ అర్భన్ నియోజకవర్గం అభివృద్ధికి రూ. 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు కెసిఆర్ ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని 8 నియోజకవర్గాల అభివృద్ధికి గతంలో ఇచ్చిన శాసనసభ్యుల నిధులకు అదనంగా మరో రూ. 10 కోట్ల నిధులిస్తున్నట్లు తెలిపారు.నిజామాబాద్ పాత కలెక్టరేట్ భవనం ఉన్నచోట ఇందూరు కళాభారతి ఆడిటోరియం కట్టుకుందామన్నారు. అంతకుముందు జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కెసిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, కెఆర్.సురేష్ రెడ్డి, బిబి పాటిల్, ఆర్‌టిసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, జెడ్‌పి చైర్మన్ విఠల్ రావు, ఎంఎల్‌సిలు కల్వకుంట్ల కవిత, వి.గంగాధర్ గౌడ్, బి.రాజేశ్వర్ రావు, శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా, ఆశన్నగారి జీవన్ రెడ్డి, మహ్మద్ షకీల్, గంప గోవర్దన్, హన్మంత్ షిండే, జాజుల సురేందర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు.