- Advertisement -
రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లిస్తుందని ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ డిస్కంలు ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ ఆన్‌లైన్ పోర్టల్ ఆర్థిక శాఖతో అనుసంధానమై ఉంటుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క విద్యాసంస్థలకు అందజేస్తున్న ఉచిత విద్యుత్తు సరఫరా చేసే ఉత్తర్వులను విడుదల చేశారు.
- Advertisement -