Friday, November 15, 2024

మా స్కూల్‌కు ఉచిత విద్యుత్

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఐదో తరగతి విద్యార్థి అంజలి లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కూడా ఈ అంశాన్ని చేర్చారు. అయితే తమకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరుతూ ఓ విద్యార్థిని సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన 5 వ తరగతి విద్యార్థిని అంజలి తన పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ సిఎంను ఉచిత విద్యుత్ కావాలని కోరింది.

ఆ విద్యార్థిని రాసిన లేఖలోని సారాంశం ఇలా….“గౌరవనీయులైన ముఖ్యమంత్రికి నమస్కరించి వ్రాయునది.. సిఎంగా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. దయచేసి మా ప్రభుత్వ స్కూల్‌కు ఉచిత విద్యుత్ అందించాలని మనవి” అని కోరుతూ లేఖ రాసి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ కాగా వి ద్యార్థిని లేఖపై సిఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ప్రజ లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News