Sunday, December 22, 2024

ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలి

- Advertisement -
- Advertisement -

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు
ప్రధానోపాధ్యాయుల విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామాల్లో, పట్టణాల్లో పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఉపముఖ్యమంత్రి మల్ల భట్టి విక్రమార్కను విజ్ఞప్తి చేసింది. శుక్రవారం సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఎస్.గిరిధర్ శుక్రవారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సహా ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రివర్యులను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కూడా సమగ్ర శిక్ష పథకంలో భాగంగా అన్యువల్ వర్క్ ప్లాన్ అండ్ బడ్జెట్ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించి, వాటిలో ఆమోదించిన మొత్తంలో 60 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొదటి విడతగా విడుదల చేసిన మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా 40 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ను విడుదల చేస్తే, కేంద్ర ప్రభుత్వం నుండి రెండవ విడత నిధులు విడుదలవుతాయని, లేని సందర్భంలో నిధుల విడుదల అక్కడితో ఆగిపోతుందని వివరించారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌గా సుమారు రూ.150 కోట్ల విడుదల చేయాల్సి ఉందని, అవి విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం నుండి సుమారు మరో రూ.600 కోట్ల తదుపరి విడతలలో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుండి చెల్లించవలసిన 40 శాతం వాటాను పాఠశాల విద్యాశాఖకు విడుదల చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. గత కొన్ని నెలలుగా ఈ కుబేర్‌లో ప్రభుత్వ చెల్లింపుల కోసం పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగుల వివిధ రకాల బిల్లులను చెల్లించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News