Thursday, September 19, 2024

రైతులకు ఇచ్చే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే: సిఎం జగన్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందించే విద్యుత్ ఎప్పటికీ ఉచితమేనని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ‌మోహన్‌రెడ్డి  స్పష్టం చేశారు.

అమరావతి: రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందించే విద్యుత్ ఎప్పటికీ ఉచితమేనని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ‌మోహన్‌రెడ్డి  స్పష్టం చేశారు. గురువారం సిఎం జగన్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఉచిత విద్యుత్‌ పథకం అంశంపై సుదీర్ఘంగా చర్చించింది.అనంతరం ఉచిత విద్యుత్ పథకం-నగదు బదిలీకి ఎపి కేబినేట్ ఆమోదం తెలిపింది. 30-35 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేదనని సిఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని.. మరో లక్ష అనధికార కనెక్షన్లను గుర్తించామని, వాటిని రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఒక్క కనెక్షన్‌ కూడా తొలగించమని.. సంస్కరణల వల్ల రైతుపై ఒక్క పైసా భారం లేదని వివరించారు. కనెక్షన్‌ ఉన్న ప్రతి రైతు పేరుమీద బ్యాంకు ఖాతా తెరుస్తామని చెప్పారు. ఉచిత విద్యుత్ ను చంద్రబాబు ఎగతాళి చేశారని మంత్రి పేర్నినాని అన్నారు. రైతుల సమస్యలను చూసే వెఎస్సార్ ఉచిత విద్యుత్ ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ పై పరిమితులు లేవని, రైతుల ఆత్మ స్థైర్యాన్ని పెంచేందుకే రైతుల ఖాతాల్లో డబ్బులు జమా చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతుల ఖాతాల నుంచి ఆటోడెబిట్ ద్వారా డిస్కంలకు చెల్లింపు జరుగుతుందన్నారు. ఇందుకు రూ.8,300 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని పేర్నీనాని వివరించారు. కాగా, శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News