Wednesday, January 22, 2025

ఉప్పల్ లో భారత్-ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్‌కు ఫ్రీ ఎంట్రీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్‌ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగనున్న తొలి టెస్టుకు ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నారు. జనవరి 25 నుంచి హైదరాబాద్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. జంటనగరాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులకు మ్యాచ్‌ను ఉచితంగా చూసేందుకు అనుమతి ఇవ్వనున్నారు.

అంతేగాక మ్యాచ్‌కు హాజరయ్యే విద్యార్థులకు భోజనం కూడా ఉచితంగానే అందిస్తారు. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) అధికారులు వెల్లడించారు. మ్యాచ్‌కు విద్యార్థులను పంపించాలనే భావిస్తున్న పాఠశాలల ప్రిన్సిపాల్స్ తమ స్కూల్ నుంచి ఎంత మంది హాజరవుతున్నారనే విషయాన్ని హెచ్‌సిఎ సిఇఓకు తెలపాల్సి ఉంటుంది. జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకున్న ఛాన్స్ ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News