Monday, December 23, 2024

సైబరాబాద్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం

- Advertisement -
- Advertisement -

Free eye medical camp in Cyberabad

హైదరాబాద్: పోలీసు సిబ్బంది కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పోలీసులు దాదాపు 327మందికి వైద్యులు కంటి పరీక్ష నిర్వహించారు. పోలీసుల కోసం 24,25వ తేదీల్లో వైద్య శిబిరం కొనసాగుతుందని, వైద్య పరీక్షలు చేయించుకునేవారు ఉదయం 9.30 గంటల నుంచి 5 గంటల వరకు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సిపి స్టిఫెన్ రవీంద్ర కోరారు. ఉచిత వైద్య శిబిరాన్ని పోలీసులు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పోలీసులకు స్మార్ట్ విజన్ ఐ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ అబిదా ఫాతిమా, ప్రేమ్, నరేష్, శ్రీకాంత్, నవ్య, మెడికవర్ ఆస్పత్రి వైద్యులు శ్రీహరి, రాచెల్, జుమా సర్కార్ తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎడిసిపి రియాజ్ ఉల్ హాక్, ఆర్‌ఐ తరుణ్‌కుమార్, యునిట్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సరిత, డాక్టర్ సుకుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News