Wednesday, January 22, 2025

అంధత్వంతో ఏ ఒక్కరు బాధపడొద్దు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అంధత్వంతో ఏ ఒక్కరు బాధపడొద్దనే ఆలోచనతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. గురువారం గొల్లపేట, ఖురాన్ పేట్, బంగల్ పెట్ లో రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కంటి పరీక్షలు చేయించుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ శిబిరాలలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్ళదాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగానే కంటి ఆపరేషన్‌లు చేయించడం జరుగుతుందని వివరించారు. స్థానిక ప్రజాప్రతనిధులు, అధికారులు , సంబంధిత శాఖల ఏఎన్ఎం, ఆశవర్కర్స్,అంగన్వాడీ టీచర్స్, సెక్రటరీలు తమ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం జరిపి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కంటి పరీక్షలకు అందరు వచ్చేవిదంగా ప్లెక్సీలు,చాటింపు, కరపత్రాల ద్వారా ప్రతి ఒక్కరికీ ఆహ్వాన పత్రలను అందజేసీ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలన్నారు. కంటి వెలుగు వైద్య శిబిరానికి18 సం.పైబడిన ప్రతి ఒక్కరు పాల్గోనేలా, ఎవరికి ఎలాంటి కంటి సమస్యలు ఉన్నా అత్యున్నత ప్రమాణాలతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, కళ్ళఅద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కలెక్టరేట్ ముషారఫ్ ఫారూఖీ అలీ, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News