Saturday, November 23, 2024

ఉచిత చేప పిల్లలతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు: తలసాని

- Advertisement -
- Advertisement -

Free fishes released in lake in Siddipet

సిద్దిపేట: సమైక్య రాష్ట్రంలో కులవృత్తుల నిరాదరణతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సిద్దిపేట జిల్లాలో రూ.4 కోట్ల 87 లక్షల రూపాయలతో అన్ని జలాశయాలు, చెరువుల్లో 4 కోట్ల 19 లక్షల చేప, రొయ్య పిల్లలను వదులుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మత్సకారుల జీవన ప్రమాణాలు పెంచడానికే ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2014 నుంచి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపడుతుందన్నారు. కులవృత్తులకు పూర్వ వైభవం కల్పించేoదుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, తెలంగాణలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని ప్రశంసించారు.

 తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం రూ.115 కోట్లతో 93 కోట్ల చేప పిల్లలను, 25 కోట్ల రొయ్య పిల్లలను జల వనరుల లో విడుదల చేస్తున్నామని వివరించారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో స్వరాష్ట్రంలో మత్స్యకారుల జీవితాల్లో సిఎం కెసిఆర్ కొత్త వెలుగులు నింపారన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవ తో గుక్కెడు మంచి నీళ్ళ కోసం గోస పడ్డ ప్రాంతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్న స్థితికి వచ్చామన్నారు. మత్స్య సంపద పెరగడంతో మత్స్య కారులకు ఆదాయంతో పాటు ప్రజలకు ఆరోగ్యం పెంపొందుతుందని, ఈ అవకాశాన్ని మత్స్య కారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మత్స్యకారులు జిల్లా ఫిషరీస్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పండుగ వాతావరణం లో ప్రతి చెరువులో చేప పిల్లల విడుదల చేయాలన్నారు.

చేప పిల్లల విడుదల కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని తలసాని పిలుపునిచ్చారు. జలవనరులలో కౌంటింగ్ లో రాజీపడకుండా నాణ్యమైన చేప పిల్లలను అధికారులు విడుదల చేస్తున్నారని, విడుదల ప్రక్రియ అద్యాంతం వీడియో తీసి భద్రపరుస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్, ఇంటిటి కి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. పెన్షన్ ల తో వృద్ధులకు, అభాగ్యులకు ఆదరణ, గౌరవం పెరిగిందని, గౌరవెళ్ళి ప్రాజెక్ట్ పూర్తయితే 2 లక్షల ఎకరాల కు సాగునీరు అందిస్తామని, తోటపల్లి జలాశయంతో 75 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News