- Advertisement -
లక్నో : రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం లోని మహిళలకు ఏ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈమేరకు బుధవారం ఉత్తరప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 21 అర్థరాత్రి నుంచి 22 అర్ధరాత్రి 12 గంటల వరకు అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణి చేయవచ్చని ఉత్తర్వులో వివరించింది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా దాదాపు 3.5 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారని ప్రభుత్వం వివరించింది.
Free for women on buses on Raksha Bandhan
- Advertisement -