Sunday, December 22, 2024

ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలా?

- Advertisement -
- Advertisement -

పేద వర్గాల కోసం ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకం కింద లబ్ధిదారునికి ఉచిత గ్యాస్ సిలిండర్ బహుమతిగా వస్తుంది. కాగా, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వాసులు ఈ పథకం ప్రయోజనం పొందుతున్నారు. ఈ ఏడాది దీపావళికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీని వల్ల లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.

ఒకవేళ మీరు కూడా ఈ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే.. ఖచ్చితంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజనకు కనెక్షన్ కలిగి ఉండాలి. అంతేకాకుండా..మీ ఆధార్ కార్డ్ కూడా LPG కనెక్షన్‌కి లింక్ చేసుకొని ఉండాలి. మరోవైపు..గ్యాస్ ఏజెన్సీ నుండి E-KYC కూడా ఉండాలి. మీరు ఇంకా ఈ పనిని పూర్తి చేయకపోతే..మీరు వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలి. ఇది కాకుండా..ఉజ్వల పథకం లబ్ధిదారుడు మొదట సిలిండర్ కోసం డబ్బు చెల్లించాలి. అయితే, ఆ డబ్బు 3-4 రోజుల్లో అతని బ్యాంక్ ఖాతాకు తిరిగి వస్తుంది.

ముందుగా మీరు సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లాలి. అక్కడికి వెళ్లడం ద్వారా మీరు మీ రిజిస్ట్రేషన్‌ను ధృవీకరించుకోవాలి. దీని తర్వాత మీరు మీ గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలి. ఇ-కెవైసిని కూడా పూర్తి చేయాలి. ప్రభుత్వం నుండి ఉచిత సిలిండర్ బహుమతిని పొందడానికి లబ్ధిదారుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, పాన్ కార్డ్‌తో పాటు ఆదాయ ధృవీకరణ పత్రం, గ్యాస్ కనెక్షన్ కాపీని తీసుకెళ్లాలి. ఉజ్వల పథకం ప్రయోజనాలు కేవలం మహిళలకు మాత్రమే లభిస్తాయి. ఈ పథకంలో ప్రభుత్వం సిలిండర్‌పై సుమారు రూ.300 సబ్సిడీ ఇస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News