హైదరాబాద్ : నగరానికి చెందిన ఆరోగ్య సంరక్షణ స్వచ్చంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, ఎస్‌ఈఈడీ-యూఎస్‌ఎతో కలిసి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం రాజేంద్రనగర్‌లోని వాడి ఇ మహమూద్‌లో ఉన్న మశీదులో మొదటిసారి గ్లాకోమా సమస్యకు ఉచిత కంటి పరీక్షలను ప్రారంభించింది. ఒకేచోట ఇటువంటి ఉచిత సమగ్ర కంటి సంరక్షణను అందిస్తున్నామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మజారుద్దీన్ తెలిపారు. ఎటువంటి ఖర్చు లేకుండా పేద వర్గాలకు చేరువైన ఇటువంటి సమగ్ర కంటి సంరక్షణ సౌకర్యాలు అంధత్వం ఇతర కంటి సమస్యలను నివారించడంలో ఎంతో దోహదపడతాయని తెలిపారు.
అదే విధంగా హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ముజ్తబా హసన్ అస్కారీ ప్రసంగిస్తూ నిరుపేద వర్గాలలో కంటి సమస్యలపై అవగాహన స్థాయి తక్కువ ఉండడం పట్టణ మురికివాడలలో సామాజిక స్థాయిలో తక్కువ ధరలో లభిస్తుందన్నారు. సులభంగా కంటి సంరక్షణ అందుబాటులో లేకపోవడంతో – కంటి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయబడిన పేద సమాజాలలో అంధత్వానికి ఇది అతిపెద్ద కారణంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని 50 వేర్వేరు అర్బన్ మురికి వాడలలో ఉన్న స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో గత ఏడాదిలో ఇప్పటివరకు 10,062 మంది రోగులను పరీక్షించినట్లు తెలిపారు. అక్బర్ తెలిపారు.