Monday, December 23, 2024

నిమ్స్‌లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు

- Advertisement -
- Advertisement -

24 నుంచి 30వరకు బ్రిటన్ వైద్యబృందం ఆధ్వర్యంలో శస్త్ర చికిత్సలు

మనతెలంగాణ/హైదరాబాద్:గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ని మ్స్ ఆ సుపత్రిలో ఉచితంగా గుండె ఆపరేష న్లు ని ర్వహించనున్నారు. ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు బ్రిటన్ వైద్య బృందం చార్లీస్ హార్ట్ హీరోస్ క్యాంప్ పేరుతో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయనున్నారు. ఇందుకో సం నిమ్స్ మిలీనియం బ్లాక్‌లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసినట్లు నిమ్స్ ఆస్పత్రి డైరెక్ట ర్ డాక్టర్ బీరప్ప ప్రకటనలో తెలిపారు.

అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి, ఐదేళ్ల లోపు చిన్నారులకు గుండెలో రంధ్రం, ఇతర గుండె సంబంధిత వ్యాధులు ఉంటే నిమ్స్‌లో చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. బ్రి టన్ డాక్టర్ రమణ దన్నపునేని ఆధ్వర్యంలో పది మంది వైద్య బృందంతో పాటు నిమ్స్ కార్డియో థోరాసిక్ విభాగాధిపతి అమరేశ్వ ర రావు, వైద్య బృందంతో నిలోఫర్ ఆసుప త్రి వైద్యులు కూడా ఈ ఆపరేషన్లలో పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు ఉ. 9 నుంచి మ.2గంటల వరకు 040 -2348 90 25 ఫోన్‌నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News