కల్వకుర్తి : ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువు పూర్తి చేసి తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు లేని విద్యార్థుల ఇంటర్మీడియట్ విద్యకు వందేమాతరం ఫౌండేషన్ సహకరిస్తుందని ఫౌండేషన్ కార్యదర్శి మాధవ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా అమ్మాయిల కోసం రుద్రమ హోం ఫర్ గర్ల్ సంతోష్‌నగర్‌లో హాస్టల్ వారు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాశాల విద్య, హాస్టల్, భోజన వసతి ఉచితంగా కల్పించబడునని తెలిపారు.
జులై 2 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుందని, అర్హత ఉన్న వాళ్లు వచ్చేటప్పుడు మార్క్ మెమో, ఆధార్ కార్డు, 2 పాస్ పోర్టు సైజ్ ఫోటోలు తీసుకురావాలని కోరారు. హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ భారత్ పెట్రోల్ పంప్ పక్క వీధిలోని రుద్రమ హోమ్ ఫర్ గర్ల్ స్థలంలో విద్యార్థుల ఎంపిక ఉంటుందని, మరిన్ని వివరాలకు 99480 87563 నెంబర్‌ను సంప్రదించాలని ఆయన తెలిపారు.