Monday, January 20, 2025

చర్లపల్లి ఒపెన్ జైల్లో ఉచిత వైద్యశిబిరం

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి : ఖైదీల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జైళ్ల శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చర్లపల్లి ఒపెన్ జైలు సూపరింటెండెంట్ కళాసాగర్ అన్నారు. మంగళవారం చర్లపల్లి ఒపెన్ జైల్లో ఎఅర్‌సి ఆసుపత్రి, లయన్స్ క్లబ్ ఆఫ్ ఏఎస్‌రావునగర్ సంయుక్తంగా ఎన్‌జిఒ శ్రీదేవి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీలకు దంత, కంటి అర్థోపెడిక్‌కు సంభదించి పలు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ తెలంగాణ జైల్లశాఖ నూతనంగా ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని వాటిలో భాగంగా ఖైదీలకు సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా జబ్బు వచ్చిన తరువాత మందులు వాడే కంటే రాక ముందే జాగ్రతలు వహించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ జైలర్ మహిపాల్‌రెడ్డి, లయన్ సురేష్, ఎఅర్‌సి డాక్టర్ రాజు, నాయకులు జౌండ్ల ప్రభాకర్‌రెడ్డి, మల్క రమాదేవి పలువురు వైద్యులు , జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News