- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: జలమండలి మహిళ ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రి, జలమండలి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ఈ మెడికల్ క్యాంప్‌ను ఎండి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.
ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటలకు శిబిరం నిర్వహించారు. ఇందులో 140 మందికి పైగా మహిళా ఉద్యోగులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. వీరికి బీపీ, షుగర్, ఈసీజీ, ఎముక, కంటి చూపు, దంత తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి వైద్యుడు డా.శశిధర్ రెడ్డి, క్యాంపు కో ఆర్డినేటర్ సురేష్, బోర్డు మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -