శనివారం హిమాయత్ నగర్ లో ప్రజల ఆరోగ్యం కోసం శారదాంబ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యాజమాన్యం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ప్రతి మనిషిలో ఆరోగ్య కారణాల వల్ల అనేక సమస్యలతో సతమత మవుతున్న నేటి సమాజం కోసం చేయూత నివ్వడం మా సంస్థ లక్ష్యమని.. బిపి, షుగర్ లాంటి వ్యాధులకు సాధరనమైన వైద్యంతో అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు అని తెలిపారు. అంతే కాకుండా ఆదివారం(రేపు) కూడా ఉచిత మెగా శిబిరం నడుస్తుందని డాక్టర్ రఘురాం పుసుకుర్ తెలియజేశారు. ఉచిత సేవ అనే భావంలో ఈ క్యాంప్ కి పలు ప్రాంతాల నుండి 200 మంది ఆరోగ్య సమస్యలపై ఈరోజు అవగాహనతో పాటు వాటి ఆరోగ్యం కోసం టెస్టులు చేయించుకున్నారు.
ఈ ఉచిత సేవను ప్రతి సామాజిక వర్గం వారు వినియోగించుకావాలని కోరుతు ప్రతి ఒక్కరూ ఆదివారం కూడా వినియోగించుకోవాలని చెప్పారు. ఆరోగ్యమే మహభాగ్యము ప్రతి ఒకరు ఈ సదవకాశాన్ని వాడుకొని మెడికల్ రిపోర్టులు, అంతే కాకుండా డాక్టర్స్ సూచనలు తీసుకొని మెరుగైన వైద్యం పొందాలని తెలియజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరం ప్రతి నెల రెండు రోజులు ఉంటుదని సిబ్బంది తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ రఘురాం, జనరల్ పిజీసియన్, దియాబియాటలజిస్ట్, కోఆర్డినేటర్ గణేష్, సిబ్బంది పాల్గొన్నారు.