Wednesday, January 22, 2025

జిఎంఆర్‌ఎం ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిఎంఆర్‌ఎం ట్రస్టు జనరల్ సెక్రటరీ గండ్ర గౌతమ్‌రెడ్డి ఆదేశానుసారం భూపాలపల్లి మండల కేంద్రంలోని నందిగామ బిఆర్‌ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు లింగమల్ల బోస్ ఆధ్వర్యంలో సురక్ష హాస్పటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిభిరాన్ని ఆదివారం నిర్వహించారు.

ఈ శిభిరంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, భూపాలపల్లి బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నాగారం సర్పంచ్ పిన్‌రెడ్డి రాజిరెడ్డి, భూపాలపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, గ్రామ సర్పంచ్ శ్యామ్‌లు పాల్గొని గ్రామస్తులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,

అదే విధంగా ఏమైనా అనారోగ్యంతో బాధపడిన రోగులు భూపాలపల్లిలోని 100 పడకల ఆసుపత్రిలోని మెరుగైన వైద్య సేవలు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిలు పేద ప్రజల కోసం ప్రత్యేక చొరవతో నిర్మించిన సందర్భంగా మెరుగైన వైద్యం పొందవచ్చునన్నారు. ఉచిత వైద్య క్యాంప్ నిర్వహించిన సురక్ష హాస్పటల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామ్, బోస్, శ్రీకాంత్, అశోక్, సురేందర్, వైద్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News