Monday, December 23, 2024

టిమ్స్ భవన నిర్మాణ కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  నగరంలో నేడు వైద్యం ఖరీదు కావడంతో ప్రైవేట్ ఆసుపత్రులు కార్మికులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకొస్తున్నాయి. గురువారం సనత్ నగర్ వద్ద నిర్మాణంలో ఉన్న తెలంగాణా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సైట్ లో పని చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు, ఇతరత్రా సిబ్బందికి ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రి ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ ద్వారా నిర్మితమవుతున్న 1000 పడకల హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమంలో పాలు పంచుకొంటున్నకార్మికులు, సిబ్బందికి ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ కు చెందిన వైద్యులు డా. సమీర, ఆప్టోమెట్రిస్టు తస్నీమ్ ఆధ్వర్యంలో ప్రాథమిక పరీక్షలతో పాటూ కంటి పరీక్షలు కూడా ప్రత్యేకంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రి వైద్య నిపుణురాలు డా. సమీర మాట్లాడుతూ నిరంతరం కాలుష్యంతో కూడిన వాతావరణంలో పని చేసే భవన నిర్మాణ కార్మికులు నియమిత కాలంలో ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని సూచించారు. అంతే గాకుండా భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాల భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి ప్రమాదం జరిగినా ఆరోగ్య సమస్య తలెత్తినా స్వీయ వైద్యం చేసుకోకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది తాతాజీ, దుర్గ, సునీత, బర్షా రాణి లతో పాటూ క్యాంపు కోఆర్డినేటర్ పెంచల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News