Saturday, January 11, 2025

భవన నిర్మాణ కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః భవన నిర్మాణ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లేబర్ కార్డు పొందిన భవన నిర్మాణ కార్మికులకు 50 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తామని ప్రకటించింది. లేబర్ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని, ఏవైనా వ్యాధులు నిర్ధారణ అయితే సంబంధిత ఆసుపత్రులకు సిపారసు చేస్తామని తెలంగాణ కార్మిక శాఖ వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా లేబర్ కార్డుదారులకు రూ.10 వేల వరకు ఖరీదు చేసే 50 రకాల పరీక్షలు ఉచితంగా అందనున్నాయి.

దీని కోసం ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు.ఈసీజీ, బీపీ, ఊపిరితిత్తులు, కంటి చూపు, చెవి, ముక్కు, గొంతు, రక్తం, మూత్రం, షుగర్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటి ద్వారా ఏవైనా ఆరోగ్య సమస్యలను గుర్తిస్తే హైదరాబాద్ వంటి నగరాల్లోని ప్రధాన ఆసుపత్రులకు పంపిస్తారు. చిన్న చిన్న సమస్యలకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తారు. లేబర్ కార్డు లేని వారు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, 2 ఫొటోలు తీసుకుని గ్రామ పంచాయతీకి వెళితే పేరు నమోదు చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News