Tuesday, December 24, 2024

కిష్టాపూర్‌లో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం

- Advertisement -
- Advertisement -

చేగుంట: చేగుంట మండలం కిష్టాపూర్‌లో ఉచిత మేగా వైద్య శిబిరాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రారంభించారు. ఆదివారం రుక్మిణి సత్యభామ పమేత వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద లయన్స్ క్లబ్ హైదరాబాద్ వారిచే ఉచిత మేగా నేత్ర వైద్య శిబిరాన్ని మాజీ సర్పంచ్ నాయిని రాజ్ గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ నేడు కిష్టాపూర్‌లో రెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకటి దైవ కార్యక్రమం, మరొకటి అందరికి ఆరోగ్యంగా ఉండే విదంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు, గ్రామం ప్రజలు లయన్స్ క్లబ్ హైదరాబాద్ వారిచే ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.

అవసరమైవారికి ఉచితంగా మందులు, ఆపరేషన్లు చేయడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకుడు చింతల భూపాల్, ఎంపిటిసి బాగ్యలక్ష్మి నాగభూశనం, కర్ణపాండు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News