Wednesday, January 22, 2025

ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే బాలికలకు కెసిఆర్ ఫౌండేషన్ ప్రోత్సాహం

- Advertisement -
- Advertisement -

Free note books under auspices of KCR Foundation

మనతెలంగాణ/అబ్దుల్లాపూర్‌మెట్: ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే బాలికలకు కెసిఆర్ ఫౌండేషన్ పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తుందని కెసిఆర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో 9,10వ తరగతులు చదివే బాలికలకు కెసిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా నోట్ పుస్తకాలు, బ్యాగ్‌లు, పెన్నులు అందజేశారు. ఈ సందర్బంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఆడపిల్లలను బాగి చదివిస్తే వారిలో దాగి ఉన్న నైపుణ్యతను ప్రదర్శించి రాణిస్తున్నారని తెలిపారు. ఆడ మగ అనే వివక్షత లేకుండా నేడు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెరుకు కిరణ్‌కుమార్‌గౌడ్, కో-అప్షన్ సభ్యులు నసిర్, నాయకులు తోర్పునూరి శ్రీశైలంగౌడ్, నర్సింగ్‌రావు, గడ్డం రవి, రోహిత్‌రెడ్డి, చెరుకు భాస్కర్‌గౌడ్, తోర్పునూరి వేణుగౌడ్, బొడిగే శ్రీను, చెరుకు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News