Monday, January 20, 2025

డిఎస్సి అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డిఎస్సీ టీచర్స్ భర్తీ పోటీ పరీక్షకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ కోచింగ్ క్లాసుల ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు టిఎస్‌బిసి ఇఎస్‌డిటిసి డైరెక్టర్ డి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. అసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నటు ఆయన వెల్లడించారు. ప్రతిభా అధారంగా 100 మందిని ఎంపిక చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బిసి స్టడీ సర్కిల్‌లో అన్ లైన్ కోచింగ్ క్లాసులు (ఆన్‌లైన్ మెటీరియల్, వీడియోలు, టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లను ఆన్‌లైన్ యాప్ ద్వారా )నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హత అసక్తిగల అభ్యర్థులు ఈ నెల 12 వ తేదీ లోపు సంబంధిత ధృవీకరణ పత్రాలను జతచేసి నేరుగా ఓయులోని టిఎస్‌బిసి స్టడీ సర్కిల్ లో అందజేయాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 040– 27077929, 7780359322 ద్వారా సంప్రదించవచ్చాన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News