ఇప్పట్నుంచి రైతాంగానికి 24గంటలూ ఉచిత నాణ్య విద్యుత్
అనివార్య కారణాల వల్ల
గురువారం నాడు కొన్ని
ప్రాంతాల్లో వ్యవసాయ
విద్యుత్ సరఫరాలో
అంతరాయం ఏర్పడింది
ఇకనుంచి ఎక్కడా
అటువంటిది ఉండదు
ఆందోళన వద్దు : ట్రాన్స్‌కో
జెన్‌కో సిఎండి
ప్రభాకర్ రావు
మన తెలంగాణ / హైదరాబాద్ : అనివార్య కారణాల వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని ట్రాన్స్‌కో అండ్ జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. గురువారం కొన్ని ప్రాంతాల్లో అనివార్య కారణాల వల్ల వ్యవసాయ రంగం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందన్నారు. ఎన్‌పిడిసిఎల్ సంస్థలో కొంత సమాచార లోపం తో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏ ర్పడిందన్నారు. ఈ రోజు నుంచి రాష్ట్ర రైతాంగానికి 24 గంట ల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా యథావిధిగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అం తరాయం ఉండదని రైతన్నలు ఎవరూ ఆందోళ న చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చారు. ఇన్ని రోజు లు ఏవిధంగా 24గంటల విద్యుత్ సరఫరా ఉందో అలాగే సరఫరా ఉంటుందని సిఎండి ప్రభాకర్ రావు పేర్కొన్నారు.