Saturday, November 2, 2024

మరో ఐదేళ్లు ఉచిత బియ్యం

- Advertisement -
- Advertisement -

ఇది పేదలకు మోడీ ఇస్తున్న గ్యారెంటీ

కాంగ్రెస్‌కు బిఆర్‌ఎస్ సి టీమ్

ఎల్‌బి స్టేడియంలో జరిగిన బిసి ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోడీ

మన తెలంగాణ/హైదరాబాద్:  గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు ఇచ్చే రేషన్‌ను మరో ఐదేళ్లు పొడిగించిన ట్లు, ఇది మోడీ ఇస్తున్న గ్యారంటీ అని ప్ర ధాని నరేంద్ర మోడీ చెప్పారు. ‘తెలంగాణ లో డబుల్ ఇంజిన్ సర్కార్ కావాల్సిందే, తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడాల’న్నారు. బిసిల ఆత్మగౌరవ సభలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో బిజె పి నిర్వహించిన ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ఎల్బీ స్టేడియంతో తనకు అనుబంధం ఉందని, పదేళ్ల క్రితం ఈ స్టేడియంలో ప్రజ లు ఆశీర్వదించడంతో తాను ప్రధాని య్యానని వ్యాఖ్యానించారు. ఇదే మైదానం సాక్షిగా ఇప్పుడు తెలంగాణ కు బిసి సిఎం రాబోతున్నారన్నారు. నాటి నా సభలో ప్రసంగం కోసం టిక్కెట్ పెట్టారని, దేశంలోనే ఇదో కొత్త ప్రయోగమన్నారు.

తెలంగాణలో బిసిలు అభివృద్ధి చెందాలంటే బిజెపితోనే సాధ్యమవుతుందన్నారు. బిసి యువతకు ఉపాధి అవకాశాలు బిజెపి వల్లనే లభిస్తాయన్నారు. కేంద్ర కేబినెట్‌లో అనేకమంది బిసి మంత్రులున్నారని తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నా రన్నారు. దళితులు, పీడితులు, ఆదివా సీలకు ఎప్పుడూ బిజెపి అండగా ఉంటుందన్నారు. అబ్దుల్ కలాంను, ద్రౌపది ముర్ములను రాష్ట్రపతిని చేసింది తామేనన్నారు. లోక్ సభలో తొలి దళిత స్పీకర్ బాలయోగిని చేసింది కూడా బిజెపియే అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిసిలకు అత్యధిక సీట్లు ఇచ్చింది బిజెపియేనన్నారు. బిసిల ఆకాంక్షలను నెరవేరుస్తామని వెల్లడించారు. మెడికల్, డెంటల్ సీట్లలో బిసిలకు 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభలో సమ్మక్క సారలమ్మ, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని తలుచుకున్నారు. ప్రసంగం సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే పదాల్ని తెలుగులో పలికారు. నా కుటుంబ సభ్యులారా అంటూ పలుమార్లు పలికి అందరినీ అలరించారు. పుణ్యభూమి తెలంగాణకు ప్రమాణాలు అని వ్యాఖ్యానించారు. మోడీ అధికారంలోకి వచ్చాకే ఉగ్రదాడులు నియంత్రించగలిగారని జనసేనఅధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దేశంలో ఉన్న అత్యధిక జనాభా బిసిలని, మోడీ ప్రభుత్వం బిసిలను నోటితో చెప్పి ప్రేమించలేదని, సీటు ప్రేమించిందన్నారు. మాటలతో కాకుండా, బిసి వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ప్రేమించిందన్నారు. కార్యక్రమంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News