Monday, December 23, 2024

ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షలు ఉచిత ప్రమాద భీమా..

- Advertisement -
- Advertisement -

తాండూరు : కార్మికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజుగౌడ్ తెలిపారు. ఆటో డ్రైవర్లకు కానుకగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రూ.10లక్షల ప్రమాద ఉచిత భీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. సోమవారం మేడే సందర్భంగా తాండూరు పట్టణంలోని రైతు బజార్ ఆవరణలో నియోజకవర్గం అధ్యక్షులు అడ్వకేట్ గోపాల్ కార్మిక జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రమాద భీమా సౌకర్యం కల్పించేందుకు ఎంఎల్ఎ ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు.

ఆశావర్కర్లు, అంగన్‌వాడి టీచర్లు, ఎఎన్‌ఎంలు, లారీ డ్రైవర్లు, ఆటోడ్రైవర్లు, కులసంఘాలు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కార్మిక సోదరులు అందరు కలిసి కట్టుగా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో సిఎం కెసిఆర్ అందరిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కార్మికుల పాత్ర ఎంతగానో ఉందని అన్నారు. అదే విధంగా వారు చేస్తున్న పనికి అనుగుణంగా జీతలు పెంచిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేంద్రంలో ప్రధాని మోడి కార్మికుల కడుపుకొడుతున్నారని ఆరోపించారు. కార్మిక విధానాలకు వ్యతిరేకంగా కేంద్రం అడుగులు వేస్తుందని ఆరోపించారు.

రాష్ట్ర కార్మిక నాయకులు విజయ్ మాట్లాడుతూ నిరుపేద కార్మికులకు భీమాసౌకర్యం కల్పించేందుకుతాండూరు ఎంఎల్ఎ రోహిత్‌ రెడ్డి సొంత డబ్బులతో భీమా ప్రీమియం చెల్లించడం జరుగుతుందన్నారు. అన్ని రంగాల కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయంలో తాండూరు ఎంఎల్ఎ ముందుంటారని గుర్తు చేశారు. తాండూరు ప్రజలకు, కార్మికులకు నేనున్నాని భరోసా ఇచ్చే నాయకుడు ఫైలెట్ రోహిత్‌రెడ్డి ఒక్కరే అన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల ఎంపిపి బాలేశ్వర్‌గుప్తా, తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పు, తాండూరు నియోజకవర్గం కార్మిక విబాగం అధ్యక్షులు అడ్వకేట్ గోపాల్, నాయకులు నరేందర్‌గౌడ్, సంతోష్‌గౌడ్, వెంకన్నగౌడ్,  శ్రీధర్,రజక నర్సింహా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News