Wednesday, January 22, 2025

14 నుంచి ఉచితంగా ‘గాంధీ’ చిత్ర ప్రదర్శన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని 582 సినిమా స్క్రీన్‌లలో గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి తెలిపారు. 14వ తేదీన ఉదయం 8.00 గంటల నుంచి 11.30 గంటల వరకు, 16వ తేదీ నుంచి 24వ తేదీలలో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు గాంధీ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ నెల 15, 20 తేదీలలో గాంధీ చిత్రం ప్రదర్శించబడదని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని విద్యార్ధులు, సాధారణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఉచితంగా ప్రదర్శించబడుతున్న గాంధీ చిత్రాన్ని విక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News