Friday, December 27, 2024

విద్యార్థుల కోసం సార్ సినిమా ఉచిత ప్రదర్శన

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన ద్విభాషా చిత్రం ‘సార్'(వాతి). ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటించింది. భారీ అంచనాలతో ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలైంది.

కాగా విద్యా హక్కును చాటిచెప్పే ఈ సినిమాను పిల్లలకు ఉచితంగా ప్రదర్శించాలని సితార సంస్థ నిర్ణయించుకుంది. తాజాగా నిర్మాత నాగవంశీ సోషల్‌ మీడియా వేదికగా ‘విద్యా హక్కుపై అందరిలో అవగాహన కల్పించడమే సార్ సినిమా ప్రధాన లక్ష్యం. మా సినిమాను స్కూలు పిల్లలకు ఉచితంగా ప్రదర్శించాలని మేం కోరుకుంటున్నాం. మీరు చేయాల్సిందల్లా contact@sitharaents.com ఐడీకి మెయిల్ చేయడమే. మీరు మెయిల్ చేస్తే మా టీమ్ మిమ్మల్ని సంప్రదించి షో ఖరారు చేస్తుంది’ అని ట్వీట్‌ చేశాడు. ఇక ఇటీవలే ఖమ్మంలోని స్కూల్‌ విద్యా్ర్థులు తమకు సార్‌ మూవీ ఉచితంగా చూపించాలంటూ ధర్నాకు దిగారు. చూపించాలి చూపించాలి సార్‌ సినిమా చూపించాలి అంటే నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News