Monday, December 23, 2024

గ్రామీణ ప్రాంత యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: ధీన్ ద యాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజనలో గ్రామీణ ప్రాంత యువతీయువకులకు 3నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధ్ది సంస్థలో సెర్ప్, తెలంగాణ స్టేట్ స్కిల్ డెవలప్‌మె ంట్ మిషన్ ద్వారా జిల్లాలోని గ్రామీణ ప్రాంత ని రుద్యోగ యువతీ యువకులు 3నెలల పాటు ఉ చిత నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరగుతుందని ఉ పాధి కల్పిస్తారని చెప్పారు. ఇంగ్లీష్ వర్క్, రెడ్‌నెస్ అండ్ కంప్యూటర్ కోర్స్‌లో కంప్యూటర్ నైపుణ్యత స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటి డెవలప్‌మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ టైపింగ్ అర్థమెటిక్, హిందీ గ్రూమింగ్ ఇంటర్వూ స్కిల్స్ శిక్షణ అంశాలుగా ఉంటాయన్నారు.

అభ్యర్థులు పదవ తరగ తి, ఇంటర్ ఆపై చదువులు కలిగిన వారై ఉండాలన్నారు. వయస్సు 19నుండి 26సంవత్సరాల లో పు కలిగి ఉండాలని పేర్కోన్నారు. ఫిబ్రవరి 1వ తే దీ నుండి ఇడబ్లుర్‌సి శిక్షణ బ్యాచ్ ప్రారంభం కా నున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత హా స్టల్ భోజనం, వసతి కల్పిస్తారని, శిక్షణ అనంతరం ఉపాధి కల్పించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్స్‌లు, రేషన్ కార్డు జిరాక్స్‌తో పాటు 4పాస్‌పోర్టు సైజు ఫోటోలతో సంగారెడ్డి బైపాస్ రోడ్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్ పక్కన గల పాత డిఆర్‌డిఎ ఆఫఅసుకు ఫిబ్రవరి1న ప్రారంభమయ్యే బ్యాచ్‌కు హాజరు కావచ్చన్నారు. ఈ అవకాశాన్నీ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు వనియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News