Sunday, January 19, 2025

మధుమేహ రోగులకు ఉచితంగా ప్రత్యేక పాదరక్షలు : బి. నాగేందర్

- Advertisement -
- Advertisement -

గోషామహల్: పేదరోగులకు చేయూత అందించి ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు అభినందనీయమని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉస్మానియా ఆసుపత్రిలో హెల్పింగ్ హ్యాండ్స్ లెఫ్రా ఇండియా సం స్థల సంయుక్త ఆధ్వర్యంలో మధుమేహ రోగుల కోసం ప్రత్యేకంగా రూ పొందించిన చెప్పులను ఉచితంగా పంపిణీ చేసేందుకు డాక్టర్ నాగేందర్ స మక్షంలో ఎండోక్రైనాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, ఆర్థోఫెడిక్, చర్మ విభాగాల వైద్యులతో కలిసి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

మధుమేహ రోగుల పుట్ క్లినిక్‌లో మధుమేహ రోగులకు చెప్పులను అందజేయనున్నా రు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ మధుమేహ రోగులకు కాళ్లలో తరచుగా అల్సర్స్ వ్యాపిస్తుంటాయని, ప్రత్యేకంగా రూపొందించిన ధరించడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ చెప్పు లు ధరించడం వల్ల పుండ్లుగా మారిన చర్మం, ఇతర అవయవాలను తొలగించకుండా నివారించవచ్చని తెలిపారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ప్రత్యేకంగా రూపొందించిన చెప్పులు అందించేందుకు ముం దుకు వచ్చిన హెల్పింగ్ హ్యాండ్స్, లెఫ్రా ఇండియా ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి ప్రశాంత్ నాయక్, ఉస్మానియా వైద్యులు నీలవేణి, రాకేష్ సహాయ్, మనీషా సహాయ్ ఆర్‌ఎంవో డాక్టర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News