- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు 102.4 కోట్లకు పైగా ఉచిత కరోనా వ్యాక్సిన్ డోసులను అందచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచిత వ్యాక్సిన్ పద్ధతి కింద 102,48,12,505 డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్ సరఫరా చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రాలు, యుటిల వద్ద ఇప్పటికీ 10.78 కోట్ల (10,78,72,110)కు పైగా డోసుల వ్యాక్సిన్ నిరుపయోగంగా ఉందని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను విస్తృతంగా, వేగంగా చేపట్టాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్షమని ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత విస్తరించే ప్రక్రియలో భాగంగా దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం వ్యాక్సిన్లను సమీకరించి రాష్ట్రాలకు, యుటిలకు కేంద్రం ఉచితంగా సరఫరా చేయనున్నట్లు తెలిపింది.
- Advertisement -