Monday, December 23, 2024

వినాయక నిమజ్జనానికి ఉచితంగా తాగునీరు సరఫరా

- Advertisement -
- Advertisement -

Free supply of drinking water for Vinayaka immersion

నవరాత్రులు ప్రారంభం కాకముందే సీవరేజీ పనులు నిర్వహణ
11వ రోజున శోభయాత్ర జరిగే అన్ని ప్రాంతాల్లో వాటర్ క్యాంపులు: దానకిషోర్

హైదరాబాద్: నగరంలో ఈనెల 31వ తేదీ నుంచి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభకానున్న నేపథ్యంలో మంచినీటి సరఫరా, సీవరేజి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జలమండలి ఎండీ దానకిషోర్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు శనివారం అధికారులతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడానికి ముందే సీవరేజీ ముందుస్తు నిర్వహణ చర్యలు పూర్తి చేయాలని సూచించారు. నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వినాయక మండపాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఎక్కడా సీవరేజి ఓవర్‌ప్లో సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

ఏదైనా సీవరేజి సమస్య ఉంటే వెంటనే పరిష్కరించేందుకు ఎయిర్‌టెక్ మిషన్లు రెండు షిప్టులో అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే, ధ్వంసమైన మ్యాన్‌హోళ్లను, మూతలేని మ్యాన్‌హోళ్లను వెంటనే గుర్తించి మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. ఎక్కడా పైప్‌లైన్ లీకేజీలు లేకుండా చూడాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ, పోలీసు, వినాయక మండపాల నిర్వహకులతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులకు ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా ఉచితంగా తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో కేవలం ఉత్సవాల్లో 11వ రోజున జరిగే నిమజ్జనం రోజున తాగునీటిని అందించామని, ఈసారి మాత్రం నవరాత్రుల్లో 3,5,7,9వ రోజుల్లో కూడా నిమజ్జనాలు జరిగే కొలనుల వద్ద తాగునీటిని అందిస్తామని వివరించారు. తాగునీటి శిభిరాలను ఏర్పాటు చేసి తాగునీరు అందజేయనున్నట్లు చెప్పారు. నగరంలో 11వ రోజున నిమజ్జన శోభయాత్ర జరిగే అన్ని ప్రాంతాల్లో వాటర్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులలను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News