Friday, December 20, 2024

గాయపడిన క్రీడాభిమానులందరికీ బాక్స్ టికెట్లు…

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : క్రీడాభిమానుల జీవితాలతో ఆటలు ఆడుకుంటే కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, క్రీడల శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. ఇటీవల జింఖానా మైదానంలో ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మధ్య టి- 20 మ్యాచ్ టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో గాయపడిన క్రికెట్ అభిమానులను ఆదివారం తన కార్యాలయంలో మంత్రి పరామర్శించారు. జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. అనంతరం గాయపడిన క్రీడాభిమానులతో కలిసి మంత్రి ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. తొక్కిసలాటలో గాయపడిన క్రీడాభిమానులందరికీ బాక్స్ టికెట్లు ఇచ్చి ఈ రోజు మ్యాచ్‌ను ఉచితంగా చూసే అవకాశం. కల్పించినట్లు మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ నవీనను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఆమెకు క్రీడా శాఖ తరఫున పదోన్నతి ఇవ్వడంతో పాటు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిజిపికి కూడా లేఖ రాశామని,మరో కానిస్టేబుల్ విమలకు రివార్డును అందించాలని హైదరాబాద్ కమిషనర్‌కు సిఫార్స్ చేస్తామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News