Friday, December 27, 2024

గర్భిణీలకు ఉచిత టీఫా స్కీనింగ్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

 

రెండు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు
తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు లోపాలను గుర్తిస్తున్న వైద్యులు
గ్రేటర్‌లో 12 యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిన వైద్యశాఖ

హైదరాబాద్: నగరంలో పేదల ఆరోగ్య కోసం ప్రభుత్వం ఉచిత వైద్య సేవలందిస్తూ ప్రజల నుంచి ప్రశంసలు పొందుతుంది. బస్తీదవాఖానలు, డయాగ్నస్టిక్ హాబ్‌లు ఏర్పాటు చేసి సకాలంలో చికిత్సలు అందిస్తున్నారు. తాజాగా గర్భిణీలకు ఉచితంగా స్కానింగ్ పరీక్షలు చేసేందుకు గ్రేటర్ పరిధిలో 12 టిఫా స్కానింగ్ మిషన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. 04 టీచింగ్ ఆసుపత్రులు, 05 వైద్యవిధాన పరిషత్ పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో సేవలు ప్రారంభించారు.

గాంధీలో 02, సుల్తాన్‌బజార్‌లో 02, పేట్లబూర్జ్ ప్రసూతి దవాఖానలో 02, నిలోఫర్‌లో 01 చొప్పన 7 యంత్రాలు, మలక్‌పే, నాంపల్లి, కొండాపూర్, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రుల్లో ఒకటి చొప్పున యంత్రాలతో సేవలందిస్తున్నారు. 100 మందిలో ఏడుశాతం శిశువుల్లో లోపాలుంటాయని, వాటి టీఫా స్కాన్‌తో గుర్తించే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. కాన్పులు ఎక్కువ శాతం ఇన్‌స్టిట్యూషన్ ఆసుపత్రుల్లో జరుగుతాయి.

వీటితో నెలకు 20వేల మంది గర్భిణీలకు స్కానింగ్ చేసే వెసులుబాటు ఉంటుందని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి రూ. 2వేల నుంచి రూ. 3వేలు ఖర్చు అయ్యే ఈస్కానింగ్‌ను ప్రభుత్వం ఉచితంగా చేస్తున్నట్లు చెప్పారు. మిషన్ల సహాయంతో తల్లిగర్భంలోని బిడ్డకు ఉన్న లోపాలను గర్భస్థ దశలో సులువుగా గుర్తించవచ్చని, దీంతో వారికి అవసరమైన వైద్యం సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. గర్భిణీలకు 18 నుంచి 22 వారాల మధ్య వారికే స్కానింగ్ చేస్తామని వైద్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. మొన్నటి వరకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకునేవారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈసేవలు ప్రారంభించడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటూ నగరంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈసేవలు అందుబాటులోకి తీసుకొచ్చి పేదలకు ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాలని గర్భిణీల కుటుంబ సభ్యులు సూచిస్తున్నారు. అదే విధంగా త్వరలో మరో 20 బస్తీదవఖానలు ప్రారంభించేందుకు సిద్దం చేయగా, 17 దవాఖానలు ఏర్పాటుకు సహకరిస్తామని జీహెచ్‌ఎంసీ పేర్కొనడంతో ఆదిశగా జిల్లా వైద్యశాఖ కసరత్తు వేగం చేసింది. సంక్రాంతి వరకు 300 బస్తీదవఖానలు ఏర్పాటు చేసి ఆరోగ్య హైదరాబాద్‌గా నగరానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తామని వైద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News