Monday, January 27, 2025

బౌద్ధ క్షేత్రాలకు ఉచిత ‘తీర్థ యాత్ర’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారానికి వచ్చిన పక్షంలో బౌద్ధ క్షేత్రాలకు ఉచిత ‘తీర్థ యాత్ర’ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ శనివారం ప్రకటించింది. ఢిల్లీ మాజీ ఎంపి ఉదిత్ రాజ్ విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, బౌద్ధ క్షేత్రాలకు యాత్రల కోసం పథకాలు ఏవీ లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనట్లయితే దానిని పార్టీ మారుస్తుందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం సొంత ఖర్చులతో తిరుపతి, అయోధ్య, వైష్ణో దేవి, బాలాజీ క్షేత్రాలకు వృద్ధుల కోసం యాత్రలు నిర్వహిస్తుంటుందని ఉదిత్ రాజ్ తెలిపారు.

‘సారనాథ్, బుద్ధ గయ, లుంబిని, దీక్షభూమి, మహౌ వంటి బౌద్ధ క్షేత్రాలకు యాత్ర పథకాలు ఎందుకు లేవు’ అని ఆయన ప్రశ్నించారు. ‘మా ప్రభుత్వం వచ్చినట్లయితే, మేము వివక్ష చూపం. వారికి కూడా ఉచిత యాత్రలు ఏర్పాటు చేస్తాం’ అని ఉదిత్ రాజ్ చెప్పారు. దేశవ్యాప్తంగా యాత్రా స్థలాల సందర్శనలో వృద్ధులకు సాయం చేసేందుకు ఆప్ ప్రభుత్వం 2019లో ‘ముఖ్యమంత్రి తీర్థ్ యాత్ర యోజన’ను ప్రారంభించింది. బౌద్ధ గురువులు, రవిదాస్, వాల్మీకి ఆలయాల అర్చకులకు రూ. 18 వేల వేతనాన్ని ఎందుకు ప్రకటించలేదని అడుగుతూ ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ నివాసం వెలుపల కాంగ్రెస్ ఇంతకు ముందు నిరసన ప్రదర్శన నిర్వహించిందని ఉదిత్ రాజ్ తెలిపారు. ‘ఢిల్లీలోని కిరారిలో ఒక బహిరంగ సభలో మా డిమాండ్‌ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్థించినందున మేము పాక్షికంగా విజయం సాధించాం’ అని ఉదిత్ రాజ్ విలేకరులతో చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News