- Advertisement -
అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం దగ్గరపడుతున్నకొద్దీ ఏర్పాట్లు వేగం పుంజుకుంటున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఈ వేడుకలకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా అయోధ్యకు వెళ్లేవారికోసం చత్తీస్ గఢ్ ప్రభుత్వం ఉచిత రైలును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏడాదికి 20 వేల మంది ప్రయాణికులకు రామ్ లాలా దర్శనం కల్పించేందుకు వార్షిక ఉచిత రైలు పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
18 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసున్న, వైద్యపరంగా ఎలాంటి సమస్యలూ లేని భక్తులు, దివ్యాంగులు ఈ రైలులో ప్రయాణించేందుకు అర్హులు. వారానికి ఒకసారి ఈ రైలు రాయ్ పూర్, దుర్గ్, రాయ్ గఢ్, అంబికాపూర్ స్టేషన్ల మీదుగా అయోధ్య చేరుకుంటుంది. ప్రయాణికులు రాత్రి వారణాశిలో బస చేసి, కాశీవిశ్వేశ్వరుని దర్శనం కూడా చేసుకునే వీలు కల్పిస్తున్నారు.
- Advertisement -