Monday, December 23, 2024

బిసి స్టడీ సర్కిల్ లో వాళ్లకు ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడగింపు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ / వనపర్తి : తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఉద్యోగ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో బిసి స్టడీ సర్కిల్ జోగులాంబ గద్వాల నందు ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష కొరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జోగులాంబ గద్వాల బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు చెందిన ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ దేహదారుడ్య పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ కొరకు మీ స్టడీ సర్టిఫికెట్లు (ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ) ఈవెంట్స్ క్వాలిఫైడ్, సర్టిఫికెట్, లేటెస్ట్ క్యాస్ట్, ఇన్‌కమ్, ఆధార్ కార్డు, రెండు పాస్ పోర్టు సైజు ఫోటోలతో నేరుగా బిసి స్టడీ సర్కిల్ గద్వాల కార్యాలయంలో ఈనెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. 75 శాతం హాజరు శాతం ఉన్న విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్, ప్రతి నెలా 1000 రూపాయలు స్టయిఫండ్ 3 నెలల వరకు ఇవ్వడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 08546-293022, 9908560268 లను సంప్రదించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News