Monday, December 23, 2024

పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

- Advertisement -
- Advertisement -

Free training for police jobs

 

హైదరాబాద్ : పోలీస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు ఉతచిత శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు కసరత్తు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటనలో భాగంగా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పోలీసు ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఏర్పాటు చేస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గత కొద్ది సంవత్సరాల నుంచి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. పోలీసు శాఖలో చేరాలనుకునే ఎంతోమంది యువకులు, యువతులు సరైన మార్గనిర్దేశం లేకపోవడంతో ప్రాథమి స్థాయిలోనే విఫలం అవుతున్నారు. అలాంటి వారికి ఉచిత శిక్షణ ఇస్తే ఉద్యోగాలు పొందుతారని భావించిన పోలీసులు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని ఆయా సబ్జెక్టుల నిపుణులతో హాస్టల్ వసతి కల్పించి ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు. ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న చాలామంది అభ్యర్థులు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు.

తాజాగా రానున్న ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీపడుతున్న అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఉచిత శిక్షణ కోసం అభ్యర్థులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకోలేని అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. అనుభజ్ఞులైన అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తామని, రాతపరీక్ష, దేహదారుడ్య పరీక్షకు సంబంధించిన శిక్షణ ఇస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని అన్ని జోన్లలో ప్రీ రిక్రూట్‌మెంట్ కోర్సు నిర్వహించబడుతుందని, ఆసక్తి ఉన్న వారు తమ జోన్ పరిధిలోనే శిక్షణ పొందవచ్చని తెలిపారు. కోర్సు ప్రారంభ తేదీలు త్వరలోనే చెబుతామని తెలిపారు. రిజిస్ట్రేషన్ లింక్ http: //form.jotform.com/220792437998473 తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలు, సందేహాలకు 9490616555 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News