Monday, December 23, 2024

ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశాలతో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు రెండు రోజుల ఉచిత శిక్షణను స్థానిక జవహార్‌లాల్ నెహ్రు స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేశారు.  గోదావరిఖని వన్‌టౌన్ సిఐ రమేష్‌బాబు హాజరై ఈ సందర్భంగా స్క్రీనింగ్ టెస్ట్‌లను నిర్వహించారు. పోలీసు ఉద్యోగాల ప్రాముఖ్యత, విలువల గురించి అభ్యర్థులకు వివరించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈ ప్రాంత యువకులకు ఉద్యోగాల కల్పనలో భాగంగా విజయమ్మ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

టెస్ట్‌కు 120 మంది వరకు హాజరు కాగా, వారికి పరుగు, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. గురువారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుందని, ఎంపికైన అభ్యర్థులు ఉదయం 6 నుంచి 7.30గంటల వరకు స్టేడియం గ్రౌండ్‌లో భౌతిక శిక్షణ, 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సబ్జెక్ట్ వైస్ గా క్లాసులు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వహకులు అబ్బ రమేష్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News