Thursday, November 14, 2024

గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో శుక్ర, శని వారాల్లో రోగులకు ఉచిత శిబిరాలు

- Advertisement -
- Advertisement -

గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో శుక్ర, శని వారాల్లో రోగులకు ఉచిత సెకండ్ ఒపీనియన్ శిబిరాలు

 

మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో మల్టీస్పెషాలిటీ గ్లెనీగల్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత సెకండ్ ఒపీనియన్ శిభిరాలను ప్రారంభించింది. ప్రతి శుక్ర, శని వారాల్లో నిర్వహిస్తున్నట్లు తమ ఆరోగ్య పరిస్దితి గురించి నిపుణుల సలహాలు పొందాలనుకునే వారికి ఉపయోగకరంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఆర్దోపెడిక్, బేరియాట్రిక్ విభాగాల సర్జన్లు రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా సాయం, సలహాలు అందించేందుకు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈసందర్భంగా ఆసుపత్రి సీఈవో గౌరవ్ ఖురానా మాట్లాడుతూ శస్త్రచికిత్స చేయించుకోవడం రోగికి, వారి కుటుంబ సభ్యులకు జీవితాన్నే మార్చేసే నిర్ణయం అవుతుందని, ఈనిర్ణయాన్ని ఆర్దికంగా, మానసికంగా భరించడం దీర్ఘకాలంలోను ప్రభావం చూపుతుందన్నారు.

సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమని, జంకు, పరిణామాలు, శస్త్రచికిత్స తరువాత ప్రభావాలు వంటి అనేక ఆలోచనలలు మనసులో మెదులుతుంటాయని వెల్లడించారు. దీంతో నిపుణుల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం వ్యక్తులకు వారి కుటుంబసభ్యులకు చాలా మంచిదని, గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో ఈవిధంగా నిపుణులు సెకండ్ ఒపీనియన్ ఉచితంగా అందించడం పట్ల తాము సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. డా. వెంకటరమణ డా. సాకేత్ ఇద్దరు శుక్ర, శనివారాల్లో ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటలవరకు అందుబాటులో ఉంటారు. డా. ప్రదీప్ పల్లాటి శనివారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రోగులకు సేవలందిస్తారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News