Thursday, January 2, 2025

గ్రామపంచాయతీ బోరు యథేచ్ఛగా వాడకం

- Advertisement -
- Advertisement -

నల్లబెల్లి: గ్రామ స్మశాన వాటిక అవసరాల కోసం గతంలో సీడీఎఫ్ నిధుల నుంచి వేసిన బోరు బావిని ఓ రైతు యథేచ్ఛగా బోరు దించుకుని పొలానికి వాడుకుంటున్నట్లు గ్రామ యువకులు ఆరోపించారు. నల్లబెల్లి మండలంలోని మేడపల్లి గ్రామానికి చెందిన గ్రామ యువకులు తెలిపిన ప్రకారం.. గత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మేడపల్లి గ్రామ స్మశాన వాటిక అవసరాల కోసం బోరింగ్‌కు సీడీఎఫ్ నిధుల నుంచి మంజూరు చేయగా ఆ నిధులతో వేసిన బోరును ఓ రైతు గత కొన్నేళ్ల నుంచి వాడుకుంటున్నట్లు తెలిపారు.

ప్రస్తుత సర్పంచ్ ఎన్నికైనప్పటి నుంచి నేటి వరకు ఈ బోరుపై నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం పట్ల గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. ఎప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గ్రామస్థుల అవసరాలకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News