Monday, December 23, 2024

బీజేపీ అధికారంలోకి వస్తే ఉచితంగా అయోధ్య దర్శనం: అమిత్‌ షా

- Advertisement -
- Advertisement -

భోపాల్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తాము అధికారం లోకి వస్తే మధ్యప్రదేశ్ ప్రజలను ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య దర్శనానికి తీసుకెళ్తామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు. విదిశ జిల్లా సిరోంజ్ అసెంబ్లీ నియోజక వర్గంలో అమిత్‌షా సోమవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు.

“నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామమందిర నిర్మాణ తేదీ ఎప్పుడని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదేపదే అడిగేవారు. ఆయనకు ఇప్పుడు సమాధానం చెబుతున్నా. 2024 జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది” అని తెలిపారు.

అయోధ్య మందిర దర్శనం కోసం తాము డబ్బులు ఖర్చు చేయాలా? అని ఓ కార్యకర్త అడగ్గా, దీనికి షా బదులిస్తూ “ మీరు ఎలాంటి ఖర్చూ చేయాల్సిన అవసరం లేదు.మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామమందిర దర్శనం కల్పిస్తాం. దశలవారీగా మిమ్మల్ని అయోధ్యకు తీసుకెళ్తాం. మా ఎన్నికల మేనిఫెస్టో లోనూ ఈ హామీని ప్రకటించాం” అని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News