Wednesday, January 22, 2025

ఆర్‌టిసి ఉచిత వైఫై సేవలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సైబర్ లైనర్ పేరిట టిఎస్ ఆర్‌టిసి మినీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు నేటి నుండి అందుబాటులోకి రానున్నాయి. రేపు సైబర్ టవర్న్ వద్ద ఎసి మినీ బస్సుల్లో వైఫై సేవలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆర్‌టిసి ఛైర్మెన్, ఎంఎల్‌ఏ బాజిరెడ్డి గోవర్ధన్ జెండా ఊపిప్రారంభిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌టిసి వైఎస్ ఛైర్మెన్ విసి సజ్జనార్ (ఐపిఎస్), శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీతో పాటు స్థానిక కొండాపూర్ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ పాల్గొననున్నారు. కాగా ఐటి ఉద్యోగులకు ఆర్‌టిసిని మరింతగా చేరువ చేయడంలో భాగంగా ఉచిత వైఫైని తొలి దశలో ఐటి కారిడార్‌లో అమలు చేస్తున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియాలో వేవ్‌రాక్ నుండి రాయదుర్గం వరకు ,అలాగే రాయదుర్గం నుండి డిఎల్‌ఎఫ్ వరకు ఇలా రెండు మూడు మార్గాల్లో మినీ బస్సుల్లో వైఫై సేవలను ఆర్‌టిసి అందుబాటులోకి తెస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News