Wednesday, February 19, 2025

ఉచితాలకు బ్రేక్ పడేనా ?

- Advertisement -
- Advertisement -

ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచితాలను ప్రకటించేసంస్కృతిని తప్పుపడుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 12న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నగదు బదిలీ పథకాలు, ఉచిత రేషన్, డబ్బు అందుతున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడకుండా ఉండటానికి ఈ పద్ధతిని అనుమతిస్తుందని వ్యాఖ్యానించింది.పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే హక్కుకు సంబంధించిన కేసును విచారించిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఎన్నికలకు ముందు ఉచితాలు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేసింది.

దురదృష్టవశాత్తూ ఈ ఉచితాల కారణంగా పని చేయడానికి ప్రజలు సుముఖంగా లేరు. వారికి ఉచిత రేషన్ అందుతోంది. వారు ఏ పనీ చేయకుండానే డబ్బులు తీసుకుంటున్నారు’ అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. నిరాశ్రయులను సమాజంలో ప్రధాన స్రవంతిలో చేర్చి దేశాభివృద్ధికి దోహదపడేలా చూడాలని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశాభివృద్ధికి తోడ్పడటం ద్వారా వారిని ప్రధాన స్రవంతిలో భాగం చేయడానికి బదులు, పరాన్నజీవుల వర్గాన్ని సృష్టించడం లేదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. మహారాష్ట్రలోని రైతులకు కూలీలు దొరకడం లేదని, వారికి ఇంట్లో ఉచితంగా సరుకులు అందుతున్నాయని జస్టిస్ బీఆర్ గవాయ్ తన వ్యక్తిగత అనుభవాన్ని వివరించారు. అభివృద్ధికోసం ప్రజలను సమాజంలో విలీనం చేయాలని సూచించారు.

ఇలాంటి పరిస్థితులలో అటు రాజకీయ పార్టీలు, ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటువంటి ప్రలోభాలు దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయని తెలుసుకోవాలి. వీటి వలన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలకు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతాయి. ఉచితాల వలన మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం కష్టం. ఇటువంటి పరిస్థితులలో గతంలో సుప్రీం కోర్టు ఎన్నిక మేనిఫెస్టోల విషయలో ఇచ్చిన మార్గదర్శకాలు ఏమిటి..? మొదలైన వాటికోసం పరిశీలిద్దాం.

సుప్రీంకోర్టు ఆదేశాలు: యస్. సుబ్రమణ్యం బాలాజీ వెర్సెస్ తమిళనాడు ప్రభుత్వం కేసులో 5 జులై 2013న సుప్రీం కోర్టు ఎన్నికల సంఘానికి అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సంప్రదించి ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలకు మార్గదర్శకాలను రూపొందించాలని తన తీర్పులో ఆదేశించింది. మార్గదర్శకాలను రూపొందించడానికి మార్గదర్శక సూత్రాలను తెలిపింది. ‘ఎన్నికల మేనిఫెస్టోలోని వాగ్దానాలను ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం అవినీతి ఆచరణగా భావించలేమని చట్టంలో స్పష్టంగా ఉన్నా ఏ రకమైన ఉచితాల పంపిణీ అయినా నిస్సందేహంగా ప్రజలందరినీ ప్రభావితం చేస్తుందనే వాస్తవాన్ని తోసిపుచ్చలేమని, ఇది స్వేచ్ఛాయుతమైన న్యాయమైన ఎన్నికల మూలాన్ని పెద్ద స్థాయిలో కదిలిస్తుందని,

ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛత దెబ్బతినకుండా చూసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి లభించిన అధికారాల ద్వారా గతంలో మోడల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఆదేశాలు జారీ చేసిందని, రాజకీయ పార్టీలు ఎన్నికల తేదీని ప్రకటించక ముందే తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారనే వాస్తవాన్ని సుప్రీంకోర్టు గుర్తించిందని, ఎన్నికల ప్రకటనకు ముందు చేసే ఏ చర్యనైనా నియంత్రించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉన్నప్పటికీ ఎన్నికల మేనిఫెస్టో ఉద్దేశం నేరుగా ఎన్నికల ప్రక్రియతో ముడిపడి ఉన్నందున ఈ విషయంలో మినహాయింపు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.

ఎన్నికల సంఘం సూచనలు: సుప్రీం కోర్టు ఆదేశాలను స్వీకరించిన తరువాత ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహించి వారి వైరుధ్య అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న పిదప స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంటు లేదా రాష్ట్రానికి ఏదైనా ఎన్నికల కోసం ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేసేటప్పుడు పాటించవలసిన నియమాలను ప్రవర్తనా నియమావళిలో 8వ భాగం లో మేనిఫెస్టోను చేర్చుతూ 2015 ఏప్రిల్ 24న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలు రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆదర్శాలు సూత్రాలకు విరుద్ధంగా ఏవీ ఉండకూడదని, మోడల్ ప్రవర్తనా నియమావళిలోని ఇతర నిబంధనల స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలని,

రాజ్యాంగంలో పొందుపరచబడిన రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు పౌరులకోసం వివిధ సంక్షేమ చర్యలను రూపొందించాలని రాష్ట్రాన్ని ఆదేశిస్తున్నాయి కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలలో అటువంటి సంక్షేమ చర్యల వాగ్దానానికి ఎటువంటి అభ్యంతరం ఉండదని, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతకు భంగం కలిగించే లేదా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఓటర్లపై అనవసరమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్న వాగ్దానాలు చేయడం మానుకోవాలని, మేనిఫెస్టోలు వాగ్దానాల హేతుబద్ధతను కలిగి ఉండాలని, నెరవేర్చడానికి సాధ్యమయ్యే హామీలపైనే ఓటర్ల విశ్వాసాన్ని కోరాలని, ప్రజాప్రాతినిధ్య చట్టం

1951లోని సెక్షన్ 126 ప్రకారం నిర్దేశించినట్లు నిషేధిత కాలంలో మేనిఫెస్టో విడుదల చేయకూడదని, ఒకేవిడత ఎన్నికల విషయంలో పోలింగ్‌కు ముందు అమలుచేసే నిషేధాజ్ఞల కాల వ్యవధిలో మేనిఫెస్టోలు ప్రకటించరాదని, ఒకటికంటే ఎక్కువ విడతల్లో ఎన్నికలు జరిగితే ప్రతి విడత పోలింగ్‌కు ముందు ప్రకటించే నిషేధాజ్ఞల వ్యవధిలో మేనిఫెస్టోలు విడుదల చెయ్యకూడదని, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన మూడు రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి రాజకీయ పార్టీలు అభ్యర్థులు తప్పనిసరిగా ఆంగ్ల, హిందీ భాషల్లో మూడు ప్రతులు సమర్పించాలని ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని 8వ భాగంలో పేర్కొన్న విధివిధానాలకు అనుగుణంగానే మేనిఫెస్టోలో హామీలు, కార్యక్రమాలు, విధానాలు

కింజారపు అమరావతి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News