Friday, December 27, 2024

చక్రబంధనం నుంచి ధర్మారానికి విముక్తి

- Advertisement -
- Advertisement -

ధర్మారం: ధర్మారం పట్టణంలో ఎలనంపుడు ముగింపు ఘనంగా నిర్వహించారు. దశాబ్దన్నర తర్వాత నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించి పోచమ్మ కొలుపు, ఎలనంపుడు ఆదివారం వైభవంగా ముగించారు. శనివారం ఉదయం పంబాల పూజారుల ఆధ్వర్యంలో గ్రామ పొలిమేరలను చక్రబందనం చేయగా, ఆదివారం ఉదయం ప్రారంభమై మధ్యాహ వరకు పంబాల పూజారులు పొలిమేరలను తాకి ప్రత్యేక పూజలు నిర్వహించి బంధ విముక్తి చేశారు.

దుష్టశక్తులను గ్రామం నుండి పారద్రొలి పూజలు చేశారు. అనంతరం స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద పట్టుపరిచి విగ్రహాలకు పూజలు చేసిన అనంతరం గ్రామ ప్రజల సమక్షంలో పోచమ్మ దేవాలయానికి చేరుకొని శుద్ది చేసిన తర్వాత జంతు బలిహరణం చేసి దేవత విగ్రహాలను ప్రతిష్టించారు. ధర్మారం పట్టణ ప్రజలంతా ప్రతి ఇంటిలోను మధ్యాహ్నం గ్రామ విముక్తి కార్యక్రమం ముగిసే వరు పోయ్యి వెలిగించకుండా ఉపవాస దీక్ష పాటించారు.

పాత చాటలు, చీపుర్లు, ఉల్లిగడ్డలు, జీడిగింజలు ఇచ్చి దుష్టశక్తులను సాగనంపారు. చక్రబంధనం విముక్తి కార్యక్రమం ఎర్రగుంటపల్లి వైపు ప్రారంభమై కొత్తపల్లి వైపు నుండి జక్కన్నపల్లి మీదుగా నల్లలింగయ్య పల్లె ద్వారా ధర్మారం శివారంతతా శుద్ది చేశారు. పెద్ద ఎత్తున బలిహారనమిచ్చి పూజలు చేశారు. కులమతాలతీతంగా పట్టణ ప్రజలంతా పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పట్టణ ప్రజలు శుభాలన కాంకిస్తూ సమృద్ధిగా వర్షాలు కురువాలని కోరుతూ కుటుంబ సభ్యులందరితో కలిసి వనబోజనాలకు తరలి వెళ్లారు.

15 ఏళ్ల తర్వాత గ్రామ సర్పంచ్ పూసుకూరు జితేందర్ రావు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం నాలుగు రోజుల మహా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం సర్పంచ్ పూసుకూరు జితేందర్ రావు, జడ్పీటీసీ పూసుకూరు పద్మజ, జిల్లా రైతుబంధు సభ్యులు పూసుకూరు రామారావు, వైస్‌ఎంపీపీ మెడవేని తిరుపతి, మండల కోఆప్షన్ రఫీ, ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, ఉపసర్పంచ్ ఆవుల లత, మాజీ వీఎస్‌ఎస్ చైర్మన్ దేవి జనార్దన్,

ఆర్‌బీఎస్ సభ్యులు దేవి రాజలింగయ్య, బీజేపీ దళిత మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ, బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు నాడెం శ్రీనివాస్, గాజుల రాజు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బొమ్మగాని సతీష్ గౌడ్, బండవరం సుమన్, నిర్వహణ కమిటీ కోశాధికారి సుతారి రామన్న, పీఆర్‌ఓ దేవి అజయ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News