Monday, November 25, 2024

కెనడాలో భారత్ వ్యతిరేక పోస్టర్లు అనుచితం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కెనడా ఇతర దేశాలలో భారత వ్యతిరేక ధోరణి పట్ల విదేశాంగ మంత్రిత్వశాఖ నిరసన వ్యక్తం చేసింది. కెనడా , మరికొన్ని దేశాలలోభారతీయ దౌత్య సిబ్బందిపై హింసకు పాల్పడాలని రెచ్చగొట్టే విధంగా పోస్టర్లు వెలువడ్డాయి. దీనిపై భారత ప్రభుత్వం గురువారం తీవ్రస్థాయిలో ఖండన వెలువరించింది. ఇటువంటి వైఖరి ఆమోదయోగ్యం కాదని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఓ ప్రకటన వెలువరించారు. కెనడా , మరికొన్ని దేశాలలో ఇటీవలి కాలంలో పలు హింసాత్మక చర్యలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి తీవ్రవాద, ఉగ్రవాద శక్తులకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇతరత్రా వర్గాల స్వాతంత్రం పేరిట

రెచ్చిపోయేందుకు సంకల్పితంగానో, అసంల్పితంగానో అవకాశం కల్పిస్తున్నారు.దీనితో ఆ తరువాత ఉగ్రవాద శక్తులు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని భారతదేశం నిరసన వ్యక్తం చేసింది. ఇప్పుడు దౌత్యవేత్తల భద్రత తమకు ఆందోళన కల్గిస్తోందని దీనిని తాము ఆయా దేశాల ప్రభుత్వాలకు తెలియచేశామని అరిందమ్ బాగ్చీ వివరించారు. ఆయా ప్రాంతాల్లోని దౌత్యకార్యాలయాల రక్షణ తమకు ప్రాధాన్యత గల విషయమని తెలిపారు. దీనిపై అన్ని విధాలుగా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News